'టిక్ టాక్' కు భారీ స్థాయిలో భారతీయుల విన్నపాలు

By సుభాష్  Published on  3 Jan 2020 8:10 AM GMT
టిక్ టాక్ కు భారీ స్థాయిలో భారతీయుల విన్నపాలు

ముఖ్యాంశాలు

  • ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టిక్ టాక్ పాపులారిటీ

  • భారతదేశంలో టిక్ టాక్ కు అతి పెద్ద మార్కెట్

  • మొదటి ట్రాన్సపరెన్సీ రిపోర్ట్ విడుదల చేసిన టిక్ టాక్

  • అత్యధికంగా భారత్ నుంచి అందిన 107 డిలీట్ రిక్వెస్టులు

చిన్న వీడియోలను పెట్టే టిక్ టాక్ యాప్ కు భారత దేశం నుంచి వీడియోలను డిలీట్ చెయ్యమని, యూజర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని భారీ స్థాయిలో విన్నపాలు అందుతున్నాయి. చైనా సోషల్ మీడియా కంపెనీ బైట్ డాన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2019లో విడుదల చేసిన మొదటి ట్రాన్సపరెన్సీ రిపోర్ట్ లో టిక్ టాక్ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.

ఈ చైనా సోషల్ మీడియా కంపెనీకి భారత దేశం నుంచి 107 వీడియోలను డిలీట్ చెయ్యమని అభ్యర్థనలు అందినట్టుగా ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 11 ప్రత్యేకమైన అకౌంట్ల ద్వారా వచ్చిన వీడియోలను డిలీట్ చెయ్యమని ప్రత్యేక అభ్యర్థనలు అందినట్టుగా సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఎనిమిది అకౌంట్ల ద్వారా పోస్ట్ అయిన నాలుగు వీడియోలను దశలవారీగా తొలగించినట్టుగా సంస్థ చెబుతోంది.

యూజర్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అందుతున్న అభ్యర్థనల్లో కేవలం భారతదేశం నుంచి 47 శాతం రిక్వెస్టులు ఉన్నాయని టిక్ టాక్ చెబుతోంది. భారత్ తర్వాత అమెరికా నుంచి అత్యధికంగా 87 అభ్యర్థనలు వీడియోలను డిలీట్ చెయ్యమని అందాయట. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో జపాన్, నార్వే, యు.కెలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Tik Tok.jpg 1

ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి ఇతర సోషల్ మీడియా సంస్థలుకూడా సంవత్సరానికి రెండుసార్లు ఇలాంటి రిపోర్టులను వెలువరిస్తున్నాయి. ఈ యాప్ లో భారతదేశం నుంచి 128 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. తమకు వచ్చిన అభ్యర్థనలను పూర్తిగా పరిశీలించి అవసరం అనుకున్న సందర్భంలో తప్పనిసరిగా వీడియోలను డిలీట్ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. భారత్ యూజర్లు టిక్ టాక్ కి అత్యంత ప్రధానమైన మార్కెట్ గా మారడం విశేషం.

Next Story