రోడ్డు ప్రమాదం లో మరణించిన టిక్ టాక్ సెన్సేషన్ సోనికా… ఈ సాహసాలు అవసరమా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2019 8:03 AM GMT
రోడ్డు ప్రమాదం లో మరణించిన టిక్ టాక్ సెన్సేషన్ సోనికా… ఈ సాహసాలు అవసరమా?

వైజాగ్ : 20 ఏళ్ల సోనికా కేతవత్ సోషల్ మీడియా లో తనదైన ముద్ర వేసుకుంది. టిక్ టాక్ స్టార్ ఆమె. కొన్ని లక్షల మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. టిక్ టాక్ మాత్రమే కాకుండా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది. ఇంత పాపులారిటీ సంతరించుకున్న ఆమె అనూహ్య రీతిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. కొన్ని రోజుల క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయ పడిన సోనిక ..మూడు వారాల తరువాత సెప్టెంబర్ 11న మరణించింది.

ఈమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసినా కూడా చిన్నపాటి గాయాలతోనే బయట పడిందని ప్రచారం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ నవ్వుతూ అందరి ముందుకు వస్తుందని ఫాలోవర్స్ ఆశించారు. మళ్లీ సరదాగా టిక్ టాక్ చేస్తుందని ఊహించారు. కాని..చనిపోతుందని ఎవరూ ఊహించలేదు.

ఆ రోజు యాక్సిడెంట్‌లో సోనికతో పాటు మరో టిక్ టాక్ స్టార్ రఫీ షైక్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరే కాదు మరికొందరు స్నేహితులు కూడా బైక్‌లపై వెళ్లారు. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. సోనిక మరణం వెనక చాలా రహస్యాలు ఉన్నాయంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు టిక్ టాక్ చేసే ఇతర స్టార్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్యాయంగా ఓ అమ్మాయిని బలి చేశారంటూ సోనిక స్నేహితులపై కూడా సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఈ ప్రమాదంలో కేవలం రఫీకి మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయని.. ఆయన కోసం చందాలు కూడా సేకరించారు. కాని..సోనికకు ఏమైందని అడిగితే చిన్నపాటి గాయాలే అని అంతా తప్పించుకున్నారు. మూడు వారాల తర్వాత ఇప్పుడు సడన్‌గా ఆమె చనిపోయిందని తెలియడంతో అంతా ఒక్కసారిగా డీప్ షాక్‌లోకి వెళ్లిపోయారు. దీనికి కారణమైన ఏ ఒక్కర్నీ వదలద్దని అంతా మండిపడుతున్నారు. కనీసం తోటి స్నేహితురాలు అలా ఆస్పత్రిలో పడి ఉంటే ఎవరికీ చెప్పకుండా సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్లీ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటారా అంటూ రఫీ అండ్ గ్యాంగ్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రమాదం అని తెలిసినా బైకుల మీద సెల్ఫీ వీడియోలు తీసుకోవడంఅవసరమా అని కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story
Share it