నీకోసమే నా అన్వేషణ.. నిన్ను చేరే క్షణం కోసం.. ఎంతదూరమైనా..
By Newsmeter.Network Published on 5 March 2020 3:56 PM GMTనీకోసమే నా అన్వేషణ.. నీకోసమే నా నిరీక్షణ.. నిన్ను చేరే క్షణం కోసం పదివేల సార్లు మరిణించైనా సరే.. ఒక్కసారి జన్మిస్తా అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే మాటలు మన మనసుల్ని తాకాయి. రీల్ లైఫ్ ను వీడి రియల్ లైఫ్ లోకి వస్తే.. ఓ పులి తన తోడును వెతుక్కుంటూ చేసిన ప్రయాణం.. నెటీజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
కాలాలు మారుతున్నప్పుడు మార్పులకు అనుగుణంగా పక్షులు, జంతువులు వలసలు పోతుంటాయి. కానీ ఓ తోడు కోసం పులి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కిలోమీటర్ల పాటు ఈ ప్రేమ ప్రయాణం సాగించింది. ఈ విషమాన్ని పర్వీన్ కాస్వాన్ అనే అటవీశాఖ అధికారి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. జీపీఎస్ ట్రాకర్ల ఆధారంగా పులి కదలికలపై నిఘాపెట్టామన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, రహదారులు, అడవులు, పొలాలు దాటుకుంటూ ఈ ప్రయాణం సాగిందని తెలిపారు. పగటి పూట పులి విశ్రమించేదని.. రాత్రి వేళల్లో ప్రయాణం కొనసాగించేదని తెలిపారు. చివరికి ధాని ప్రయాణానికి ముగింపు ధ్యానగంగా అడవిలో పడిందన్నారు. పులి ఏ మార్గంలో ప్రయాణించిందో తెలిపే ఓ మ్యాప్‌ను కూడా పోస్టు చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పులి సాగించిన ఈ సుధీర్ఘ ప్రయాణం నెటీజన్ల మనసును కదిలించింది. ఇదిలా ఉండగా.. కొంతమంది నెటీజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. స్వస్థలంలో ఉన్న పులులతో పోటిపడలేకనే పులి ఇలా చేసిందని కొందరు నెటీజన్లు అంటుంటే.. బంధువుల పోరు తట్టుకోలేక ఇలా పారిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. మనుషుల ప్రేమకంటే.. ఈ పులి ప్రేమప్రయాణం ఎంతో గొప్పగా ఉందని అభిప్రాయపడుతున్నారు.