మహారాష్ట్ర: చంద్రపూర్ జిల్లాలోని గోండ్పిపారిలోని ధాబా గ్రామ అటవీ ప్రాంతంలో ఓ పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పులి కళేబరాన్ని గుర్తించిన స్ఠానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారుప. ఈ మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పులి మృతికి గల కారణాలు పోస్టుమార్టంలో తేలాల్పి ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఈ నెల మొదటి వారంలో కూడా బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి.. రాళ్ల మధ్య చిక్కుకొని ఓ పులి మరణించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఏడాది జులై నెలలో కూడా ఇదే చంద్రాపూర్‌ జిల్లాలో రెండు పులులు మృతి చెందినట్లు అటవీ శాఖ తెలిపింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.