పిడుగు పాటుకు దంపతుల మృతి
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 3 Nov 2019 10:23 AM IST

ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు భార్యభర్తలు మృతిచెందారు. కూసుమంచి మండలం కిష్టారం గామానికి చెందిన గుండెల ఉపేందర్ అతని భార్య ఈశ్వరమ్మ పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో భయంతో తల దాచుకునేందుకు పొలం సమీపంలోని చెట్టు కిందికి చేరారు. ఒక్కసారిగా చెట్టు మీద పిడుగు పడటంతో గుండెల ఉపేందర్(35), ఈశ్వరమ్మ(30) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కిష్టారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story