హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర వామపక్ష నేతలు ధర్నా చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. సీపీఐ(ఎంఎల్)నేతలు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుండగా... పోట రంగారావు అనే వామపక్ష నేత చేయి డోర్‌ల మధ్యలో పడింది. దీంతో బొటన వేలు తెగిపోయింది. "నన్ను కేసీర్‌ చంపమన్నాడా..? కార్మికుల పక్షాన పోరాడుతున్నందుకు ఇదేనా బహుమానం"అంటూ రంగారావు అవేదన వ్యక్తం చేశారు.

ఇంకా బంద్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడా పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story