కశ్మీర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వచ్చి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. మరో ఉగ్రవాది తప్పించుకుని అడవిలోకి పరారయ్యాడు. గాయాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హతమైన ఉగ్రవాదుల మృతదేహాల వద్ద పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ జాతీయ రహదారిపై భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ప్రస్తుతం ఈ జాతీయ రహదారిని మూసివేశారు. తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.