శంషాబాద్ లో ముగ్గురు కరోనా అనుమానితులు

By రాణి  Published on  11 March 2020 9:37 AM GMT
శంషాబాద్ లో ముగ్గురు కరోనా అనుమానితులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులో స్ర్కీనింగ్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు చేసిన స్ర్కీనింగ్ టెస్టుల్లో ముగ్గురు వ్యక్తులకు కరోనా లక్షణాలుండటంతో వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also Read : కిడ్నీ పేషంట్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది..

ఇప్పటి వరకూ ఎయిర్ పోర్టులో 47,611 మందికి కరోనా స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో కరోనా అనుమానితులుగా భావించిన 286 మందిని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలించి..ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు 549 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు..తెలంగాణ తొలి కరోనా కేసు బాధితుడు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా నుంచి కోలుకున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గాంధీ వైద్యులు కరోనా నుంచి టెక్కీని రక్షించారని, కరోనా సోకిన వారంతా మరణిస్తారన్న వదంతులను ఇకపై నమ్మరాదని ఆయన రాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

Also Read : కరోనా వైరస్‌ ఎక్కించుకుంటే రూ.3లక్షలు

Next Story