వారిద్దరిని కలిపింది బిగ్ బాస్ షో..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 6:18 PM IST
వారిద్దరిని కలిపింది బిగ్ బాస్ షో..!!

ఇండియాలో బిగ్‌బాస్‌ షోకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షోకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. కొన్ని నెలల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్‌ ఈ షోలో పాల్గొంటారు. అయితే హిందీతో పాటు దక్షనాది అన్ని భాషల్లో బిగ్ బాస్‌ షో జరుగుతోంది. బిగ్‌ బాస్‌ షోలలో గొడవలతో పాటు ప్రేమలు చిగురించిన సందర్భాలు కూడా చాలానే చుశాం.

కన్నడ బిగ్‌ బాస్ సీజన్‌ 5లో మ్యూజిక్‌ కంపోజర్‌ చందన్‌ శెట్టి విజేతగా నిలిచాడు. అదే సీజన్‌లో నివేదిత గౌడ కూడా పాల్గొంది. బిగ్‌ బాస్‌లో వీరి ఇద్దరి ప్రేమ చిగురించింది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ బయటకు ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీరిద్దరి రిలేషన్‌ కొనసాగింది. చెట్టాపట్టాలసుకుని తిరుగుతూ కనిపించడంతో ప్రేమ హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్న చందన్‌శెట్టి అదే కార్యక్రమంలో పాల్గొన్న నివేదితకు ప్రేమ వ్యక్తపరచగా దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకే చందన్, నివేధిత నిశ్చతార్థం చేసుకొని ఆశ్చర్యపరిచారు. సోమవారం రోజు ఓ స్టార్ హోటల్ లో చందన్, నివేదిత నిశ్చితార్థం వైభవంగా జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ షోతో కలుసుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్స్ గా మారబోతున్నారు.

Next Story