రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' లేటెస్ట్ అప్ డేట్ ఇదే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 11:38 AM GMT
రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌ లేటెస్ట్ అప్ డేట్ ఇదే.!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దాన‌య్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా న‌టిస్తుంటే... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండ‌డం విశేషం. నేడు తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం జయంతిని పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్, సినిమాలోని ఎన్టీఆర్ లుక్ పై ఒక అప్ డేట్‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది.

ఇంత‌కీ ట్విట్ట‌ర్ ద్వారా చెప్పిన అప్ డేట్ ఏంటంటే.... స్వాతంత్రోద్యమ పోరాట వీరుడు కొమరం భీం గారి జయంతి సందర్భంగా మా ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ భీం గారి శౌర్యం, గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటోంది. ఈ సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుంది. ప్రేక్ష‌కాభిమానులు ఎలాగైతే ఆయనను స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారో మేము కూడా అలాగే ఎదురు చూస్తున్నాం అని తెలియ‌చేసారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని వ‌చ్చే సంవ‌త్స‌రం జులై 30న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.Next Story
Share it