'మీకు మాత్రమే చెప్తా' చిత్రంలో చాలా ఉన్నాయి - ఆర్టిస్ట్ అభినవ్ గోమటం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 12:06 PM GMT
మీకు మాత్రమే చెప్తా చిత్రంలో చాలా ఉన్నాయి - ఆర్టిస్ట్ అభినవ్ గోమటం

పెళ్లి చూపులు సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆత‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాని అందించారు. ఇప్పుడు హీరోగా న‌టించి మీకు మాత్ర‌మే చెప్తా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ చిత్రానికి ష‌మ్మీర్ సుల్తాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో నటించిన అభినవ్ గోమటం చెప్పిన విశేషాలు మీ కోసం...

నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, సినిమాలంటే ఆసక్తితో మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాను తరువాత సినిమాల్లోకి వచ్చాను. నేను నటించిన ఈ నగరానికి ఏమైంది బాగా సక్సెస్ కావడమే కాకుండా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. యస్ సినిమా తరువాత కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా సినిమాలో చెయ్యమని ఆడినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. తరుణ్‌తో నా జర్నీ అలాంటిది.

మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్‌కు చెప్పాడు, అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది. కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది కావున విజయ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో నటించాడు. అతనికి డైరెక్షన్ స్కిల్స్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో ఆయనే ఈ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ చిత్రానికి మొదట ఎవరికి చెపొద్దు అనే టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ తో మరో సినిమా విడుదలకు సిద్దంగా ఉండడంతో మేము మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ఖరారు చేశాం. టైటిల్‌కు అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. సినిమా 2 గంటల 4 నిమిషాలు ఉంటుంది, ఎక్కడా బోర్ లేకుండా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకెక్కించడం జరిగింది.

మొబైల్ వాడకం ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరూ చేస్తున్న పని. ఆ మొబైల్ వాడకం వల్ల మా సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని ఎంటర్టైన్ పద్దతిలో చెప్పడం జరుగింది. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ట్రైలర్ లో మేము కొంతే చూపించాము. సినిమాలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఉంటాయి.

నితిన్ 'రంగ్ దే', జయంత్ సి పరాన్జీ గారి సినిమాతో పాటు హీరో సుశాంత్ సినిమాలో నటిస్తున్నాను. నాకు, ఒకే తరహా పాత్రలు చెయ్యడం ఇష్టం ఉండదు, అన్నీ రకాల పాత్రలు చెయ్యాలని ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్త్సైన్ చెయ్యాలనేదే తన కోరికని ఇంటర్వ్యూ ముగించారు.

Next Story