వారి సపోర్ట్‌ ఉంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు- ఓంకార్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 12:05 PM GMT
వారి సపోర్ట్‌ ఉంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు- ఓంకార్‌

'రాజు గారి గ‌ది-3' హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం 'రాజు గారి గ‌ది-3'. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. అక్టోబర్ 18 గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ… నా తమ్ముడు అశ్విన్‌ను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షుకుల సపోర్ట్ ఉంటే ఎవ్వరూ ఎక్కడికైనా వెళుతారు. వైజాగ్ మెలోడీ థియేటర్ లో పెద్ద హీరో షోస్‌కు మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా'రాజు గారి గ‌ది-3'కి హౌస్‌ ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

ఆలీ మాట్లాడుతూ... 'రాజు గారి గ‌ది-3'ని బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్‌కు థాంక్స్. అందరూ కష్టపడి పని చెయ్యడంతోనే ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రం నేను కూకట్ పల్లిలో చూడడం జరిగింది. ఆడియన్స్ సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుకు ఆదరిస్తున్నారు, వారి సపోర్ట్ చాలు ఈ చిత్రం విజయం సాధించడానికి అన్నారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ… సినిమాను వినోదం కోసం తీస్తారు. ఈ సినిమాలో అది ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రూ.4 కోట్ల గ్రాస్ చేసింది ఈ సినిమా. అశ్విన్ ఈ సినిమాను ప్రాణం పెట్టి తీసాడు. మంచి సినిమాను అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.

అశ్విన్ మాట్లాడుతూ... సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. నాకు ఈ సినిమాతో ఒక మార్కెట్ ఓపెన్ అయ్యిందని ఫ్రెండ్స్ చెబుతున్నారు, అందుకు సంతోషం. సినిమా చూసిన ప్రతిఒక్కరు బాగుందని చెబుతున్నారు. బుక్ మై షో రేటింగ్స్‌ చూసి నేను బాధ పడ్డాను. బుక్ మై షో వారు అందరి రేటింగ్స్‌ను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇస్తే బాగుండేది. వారు కేవలం నెగిటివ్ రేటింగ్స్ తీసుకొని పెడుతున్నారు. నేను, అవికా థియేటర్స్ విజిట్ చేశాము, రెస్పాన్స్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సినిమా చూడమని ప్రేక్షకులను కోరారు.

హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. నన్ను తెలుగులో ఇంతబాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

Next Story