హైదరాబాద్ : ఒక పక్క తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు, డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే.. మరో పక్క ప్రభుత్వం నడుపుతున్న అద్దె బస్సుల్లో కండక్టర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాగా ఒంటరిగా దూర ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు బస్పు చార్జీలకే కారులో తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి మార్గం మధ్యలో ప్రయాణికులను బెదిరించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అబ్దుల్లాపూర్‌మెట్టు పోలీసులు, రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి కారు, నాలుగు ఫోన్లు, 1900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.