హైదరాబాద్‌: బొయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును, ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ నెల 21వ తేదీన బొయిన్‌పల్లిలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న తాండూరి సరళ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై నగర పోలీస్ కమిషనర్‌ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఇవాళ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే చోరీ చేసింది..వారి కుటుంబాని చెందిన నలుగురు సభ్యులే అని దర్యాప్తులో తేలింది. వారిలో సరళ, కోడలు తాండురి సుప్రియ ప్రధాన నిందితురాలు కావడం విశేషం. ఆమెతో పాటు కొల్లూరి సాత్విక, కొల్లూరు శ్రీనివాస్, కొల్లూరు సునీతలు నిందితులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి నుంచి రెండు కేజీల బంగారు ఆభరణాలు, 6.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు..ఓ కారు, 4 మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం చోరీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి సుప్రియ నుంచి రూ.80 లక్షతు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.