పగలంతా పూజారి.. రాత్రంతా దొంగతనాలు.. పోలీసులకు అడ్డంగా దొరికిన యువకుడు
By సుభాష్
పగలంతా పూజారిగా చేస్తూ.. రాత్రాయితే చాలు దొంగతనాలు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ యువకుడు. విలువైన పూజారి వృద్దిని ఎంచుకుని చెడు అలవాట్లకు బానిసై అడ్డదారులు తొక్కుతున్నాడు. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మౌలాలీలో నివసిస్తున్న నందుల సిద్ధార్థ శర్మ (19) అనే యువకుడు పగలంతా పూజారిగా చేస్తూ, రాత్రి సమయంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతను దొంగతనాలనే వృత్తిగా ఎంచుకుని పలు ఇంటి ఆవరణలో ఉన్న విలువైన సైకిళ్లను దొంగిలించి తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టేవాడు. దీంతో సైకిళ్లు చోరీకి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సైకిళ్ల చోరీపై నిఘా పెట్టిన పోలీసులు సిద్ధార్థను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 31 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇందులో 16 సైకిళ్ల చోరీ అయినట్లు మాత్రమే తనకు ఫిర్యాదులు వచ్చాయని, ఇంకా ఎవరైన బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని మల్కజ్‌గిరి పోలీసులు సూచించారు.