హయత్‌నగర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో బుధవారం తెల్లవారుజామున చోరి జరిగింది. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్ ను కట్ చేసిన దొంగలు అందులో ఉన్న నగదును ఎత్తుకొనిపోయారు. దాదాపు రూ.లక్ష వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.