మాస్క్ ధరించి సినిమా చూస్తా: దర్శకుడు నాగ్ అశ్విన్
By సుభాష్ Published on 29 Sep 2020 10:21 AM GMTదాదాపు ఆరు నెలలు అవుతుంది సినిమా థియేటర్ల మూత పడి. అన్‌లాక్‌లో భాగంగా ఒక్కొక్కటిగా అన్ని రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సినిమా థియేటర్లు మాత్రం ఇప్పటికి తెరుచుకోలేదు. ఇప్పుడు అన్‌లాక్ 4.0 రేటితో ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్5.0 ప్రారంభం కానుంది. అయితే సినిమా థియేటర్ల ఓపెన్‌పై మహానటి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా బార్‌లు పని చేయడానికి అనుమతి ఇచ్చినప్పుడు సినిమా థియేటర్లకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. సినిమాలని యాప్‌లు, ఓటీటీల్లో కాకుండా సినిమా థియేటర్లలో చూడాలని అన్నారు.
అందరి భద్రత గురించి ఆలోచిస్తాను. అయితే మరి జిమ్‌లు, బార్‌లు , మాల్స్, దేవాలయాలు, బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులను మొదలు పెట్టారు. అలాంటప్పుడు థియేటర్లను కూడా రీ ఓపెన్ చేయాలని కోరారు. థియేటర్లలో మాస్క్ ధరించి సినిమా చూడడానికి ఆగలేకపోతున్నానని అన్నారు. పాజ్ చేయడం, ఫాస్ట్ ఫార్వడ్ చేయడం సాధ్యం కాదు.. అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అశ్విన్ చేసిన ట్వీట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.