'మిస్ మ్యాచ్' విడుద‌ల తేదీ ఖ‌రారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 12:16 PM GMT
మిస్ మ్యాచ్ విడుద‌ల తేదీ ఖ‌రారు

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్' . ఈ చిత్రంలో ఉదయ్ శంకర్‌, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళనాట 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు మీడియాకు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…

'మిస్ మ్యాచ్' చిత్ర కథను భూపతిరాజ ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్ అవుతుందన్నారు. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదలవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అన్నారు. మాకు సహకరిస్తున్న మీడియాకు కృతఙ్ఞతలు అని అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ…

ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేశాను అని అన్నారు. భూపతిరాజ కథ చాలా బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది అని అన్నారు.

Next Story