జగన్ క్విడ్ ప్రొకో కేసులో మరో మలుపు..!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:12 PM ISTఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పై గతంలో.. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో మొత్తం ఏడుగురు ఐఏయస్ అధికారులు సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్నారు. వారిలో కొందరు తమకు ప్రభుత్వం నుంచి న్యాయ సాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు జగన్ కేసుల్లో నాడు విచారణ ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఆయన సమర్పించిన బిల్లుల పైన రమణ అనే న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆయన సమర్పించిన బిల్లులు నకిలీ అంటూ పీవీ రమణ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. శర్మ పెట్టిన బిల్స్‌ను సరిగా పరిశీలించకుండానే..అప్పటి రెవిన్యూ ముఖ్య కార్యదర్శి పీవి రమేష్ నిధులు విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిల్లుల సమర్పించిన అధికారితో పాటుగా బిల్లులు పాస్ చేసిన అధికారులను.. కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు