ఆ పెట్రోల్ బంక్ ఒక్కసారిగా పేలింది..ఎందుకు?!!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 5:50 PM IST
ఆ పెట్రోల్ బంక్ ఒక్కసారిగా పేలింది..ఎందుకు?!!!

అమరావతి: సత్తెనపల్లి పెట్రోల్ బంక్‌లలో సెల్‌ ఫోన్లు వాడొద్దని ఎందరు మొత్తుకుంటున్నా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. చీటికి మాటికి ఫోన్లలో మునిగిపోయే వారైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్‌ బంక్‌లు, పేలుడు పదార్థాలు ఉన్న చోట మొబైల్ ఫోన్‌ వాడకం తగ్గించాలనే నిపుణుల సూచనలు తుంగలో తొక్కుతున్నారు. దాంతో కొన్నిసార్లు ప్రమాదాలు తప్పడం లేదు.

తాజాగా గుంటూరు జిల్లాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. అయితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోస్తున్న సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి మొబైల్ ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడున్నవారికి ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఊహించని సంఘటనతో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటే సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. తెలిసి కూడా చేసే తప్పులు చివరకు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో అనడానికి ఈ ఉదంతం చక్కటి ఉదహరణగా నిలుస్తోంది.

Next Story