'జార్జ్ రెడ్డి' కోసం సరికొత్త ఉస్మానియా విశ్వవిద్యాలయం..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:47 AM GMT
జార్జ్ రెడ్డి కోసం సరికొత్త ఉస్మానియా విశ్వవిద్యాలయం..!!

'వంగవీటి' ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో.. నటించిన మూవీ 'జార్జ్ రెడ్డి'. ఈ చిత్రంలో 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి బయోపిక్‌ ' గా ఈ సినిమా తెరకెక్కింది. 'దళం' మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ సినిమా 'ట్రైల‌ర్' భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ ట్రైల‌ర్ ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 22న రిలీజ్ చేయ‌నున్నట్లు చిత్ర బృందం తెలింది. అయితే ఈ ట్రైలర్‌లో కనిపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలా మందిని ఆకర్షించింది. కానీ..ఈ చిత్రాన్ని నిజమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిత్రీకరించారు అనుకుంటే..త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఈ చిత్రం కోసం చిత్ర బృందం సరికొత్త ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు..స్వ‌యంగా డైరెక్ట‌ర్ జీవ‌న్ రెడ్డి తెలియ‌చేశారు.

ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి దీని గురించి మాట్లాడుతూ...

"నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఫోటోను ఆర్ట్ డైరెక్టర్ కి చూపించాను. ఖ‌ర్చు ఎంతైనా ఫ‌ర‌వాలేదు సెట్ బాగుండాలి అని చెప్పాను. అంతే.. మా ఆర్డ్ డైరెక్ట‌ర్ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న టాలెంట్ అంతా ఉప‌యోగించి స‌రికొత్త ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంను అద్భుతంగా సృష్టించాడు. సెట్ అంత బాగుంది అంటే ఆ క్రెడిట్ అంతా మా ఆర్డ్ డైరెక్ట‌ర్ కే చెందుతుంది అన్నారు. అయితే ఈ సెట్‌ను రూపొందించడానికి రూ. 1 కోటి వరకు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే..ఓ రోజు భారీ వ‌ర్షం కురిసింది. బలమైన గాలులు కూడా వీయ‌డంతో సెట్ కూలిపోతుందని మేము భయపడ్డాం కానీ..దేవుడి ద‌య వ‌ల్ల ఏమీ జరగలేదది తెలిపారు. ఈ సందర్భంగా మేము ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాము అని జీవన్ రెడ్డి తెలిపారు.

Next Story