అయోధ్యలో దీపాల పండుగ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 6:54 AM GMT
అయోధ్యలో దీపాల పండుగ..!

ఉత్తరప్రదేశ్‌: దీపావళి సందర్భంగా గిన్నిస్ రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది అయోధ్య నగరం. రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక వినూత్న ఉత్సవానికి తెరతీసింది. 5.51 లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని సుందరంగా అలంకరించారు. 5.51 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోతుంది.

ImageImage

Image

Image

The festival of lights in Ayodhya

The festival of lights in Ayodhya





The festival of lights in Ayodhya

The festival of lights in Ayodhya

Up3

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫిజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగర్‌తో సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సీతారాములను ఆరాధించడంతో పాటు రామ పట్టాభిషేకం కూడా జరగనుంది. స్థానికంగా జరగనున్న ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుండి కళాకారులు పాల్గొన్నారు.

Up2

ఈ సందర్భంగా రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీపావళి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం గతేడాది మూడు లక్షల మట్టి ప్రమిదలు వెలిగించి ఉత్సవాలు నిర్వహించింది. ఈసారి 5.51 లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం రికార్డుకు ఏర్పాట్లు చేశారు.

ఇక వారణాసిలోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. వారాణాసి దీపావళి కాంతులతో నిండిపోయింది.

Image

Image

Image

Image

Next Story