నిర్భ‌య నిందితుల‌కు ఉరి.. ఎప్పుడంటే..!

By అంజి  Published on  9 Dec 2019 9:12 AM GMT
నిర్భ‌య నిందితుల‌కు ఉరి.. ఎప్పుడంటే..!

ముఖ్యాంశాలు

  • నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారు
  • డిసెంబర్‌ 16 ఉదయం 5 గంటలకు నిందితులకు ఉరిశిక్ష
  • ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ

ఢిల్లీ: ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా క్షమాభిక్ష పెట్టుకున్న వినయ్‌ శర్మ అనే నిందితుడి పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో నిందితులు నలుగురిని డిసెంబర్‌ 16న ఉదయం 5 గంటలకు ఉరి తీయనున్నారు. నిర్భయకు న్యాయం జరగనుంది.

నిందితుల్లో ఒకడు మైనర్‌ కావడంతో.. అతడిని జువైనల్‌ హోమ్‌ తరలించారు. మూడేళ్ల తర్వాత మైనర్‌ని విడుదల చేశారు. మరోక నిందితుడు రామ్‌సింగ్‌ తీహార్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మిగిలిన నలుగురి నిందితుల్లో ఒకడైన వినయ్‌ శర్మ అనే నిందితుడు రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకున్నాడు. క్షమాబిక్ష పెట్టుకున్న నిందితుల పిటిషన్లపై పునఃసమీక్ష చేయాలని పార్లమెంట్‌కు రాష్ట్రపతి సూచించారు.

వినయ్‌శర్మ క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. నిందితుడికి క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీంతో వినయ్‌ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. 2012 సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో పారామెడికల్‌ విద్యార్థిని ఆరుగురు నిందితులు అత్యాచారం చేశారు. ఆ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా దిశ హత్య ఘటన కేసు నేపథ్యంలో నిర్భయ కేసు వెలుగులోకి వచ్చింది. నిర్భయ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది.

నిర్భయ ఘటన నిందితులు ఉరిశిక్ష రద్దు కోసం ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. కాగా ఢిల్లీ హైకోర్టు కూడా ట్రయల్‌కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుల ఉరిశిక్షపై గత శుక్రవారం నాడు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును చెప్పింది. నిందితలను తీహార్‌ జైల్లోనే ఉరితీయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జైలు అధికారులు ముమ్మరం చేశారు.

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించేందుకు బీహార్‌ రాష్ట్ర ఖైదీలు ఉరితాళ్లను పేనుతున్నారు. బుక్సర్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌కు ఉరి తాళ్లను పేనమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గంగానదీ తీరంలో ఉన్న బుక్సర్ జైలు ఉరితాళ్లను పేనడంలో ప్రసిద్ధి గాంచింది.

దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ నేపథ్యంలో నిర్భయ కేసులో ఇన్నేళ్లు జాప్యం ఏంటని ప్రజలు ప్రశ్నించారు. ఇలాంటి నిందితులను తక్షణమే శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన సరిగా లేనందు వల్లే నిందితులకు సరైన శిక్షలు పడడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2017 మే 5న నిర్భయ కేసు నిందితులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో దేశంలో అత్యాచార ఘటనలను కేంద్ర ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. కోర్టులో నలిగిపోతున్న కేసులకు వెంటనే తీర్పు చెప్పేలా చూడాలని కేంద్రన్యాయశాఖ మంత్రి అన్నారు.

Next Story