ఆర్థిక మాంద్యం- మద్యం విక్రయాలపై ప్రభావం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 8:24 AM GMT
ఆర్థిక మాంద్యం- మద్యం విక్రయాలపై ప్రభావం

ఢిల్లీ: ఆర్థిక మాంద్యం ప్రభావం లిక్కర్‌ విక్రయాలపై గట్టిగానే పడుతుంది. తాజాగా వెల్లడవుతున్న గణాంకాల ప్రకారం దేశంలో ప్రధాన కంపెనీల మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది బీరు అమ్మకాలు 3శాతం మేరకు తగ్గాయి. ఇక బ్రాందీ, విస్కీ, రమ్‌, జిమ్, వోడ్కాల విక్రయాలు దేశవ్యాప్తంగా 45 శాతం పైనే తగ్గినట్లు సమాచారం.

సాధారణంగా వేసవికాలంలో బీరు అమ్మకాలు దేశవ్యాప్తంగా 45 శాతం పైనే ఉంటాయి. కానీ ఈ ఏడాదీ ఎలక్షన్‌ కమిషన్‌ విధించిన ఆంక్షలు, ఐపీఎల్‌ టోర్నీ వల్ల విక్రయం తగ్గింది. అయితే పెర్నార్డ్‌ రికార్డ్‌ తమ విక్రయాలు సెప్టెంబరు చివరినాటికి ఏకంగా మూడు శాతం పడిపోయినట్లుగా ప్రకటించింది.

అయితే మహారాష్ట్ర, హరియాణాలతో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షం భీభత్సం సృష్టించటంతో..కొన్ని ప్రాంతాల్లో వినియోగం తగ్గి లిక్కర్ సేల్స్‌ పడిపోయినట్లు వివరిచింది.

ఇదిలా ఉంటే మందు ప్రేమికులు మాత్రం నగదు లభ్యత తక్కువ కావడం వల్ల నచ్చిన బ్రాండ్లను తాగలేక..చీప్‌ బ్రాండ్లవైపు మెగ్గుచూపుతున్నారు. 'మాంద్యం ప్రభావం యునైటెడ్ స్పిరిట్స్‌ మీద తప్పకుండా ఉంటుంది. డిమాండ్‌ తగ్గడం దీనికి ప్రధాన కారణం. పండుగ సీజన్‌ వల్ల ఈ నేలలో పుంజుకున్న తర్వాత కష్టమే అని ఆర్థికనిపుణుడొకరు అంచనా వేశారు.

Next Story