హాలీవుడ్ కమెడియన్ మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు
లాస్‌ఏంజిల్స్: హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, కమెడియన్ జాన్ విథర్‌స్పూన్ (77) కన్నుమూశారు. 'ఫ్రైడే' చిత్రంలో ఐస్‌క్యూబ్ తండ్రిగా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించిన విథర్‌స్పూన్ లాస్‌ఏంజిల్స్‌లో మరణించారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ అలెక్స్ గుడ్‌మన్ తెలిపారు. విథర్‌స్పూన్ మృతితో కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు ఫ్రైడే పేరుతో తెరకెక్కిన మూడు చిత్రాల్లో నటించిన ఆయన తన కెరీర్‌ను హాలీవుడ్‌లో రాణించారు.
అంతేకాక 'వాంపైర్ ఇన్ బ్రూక్లిన్, బూమేరాంగ్' వంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రాలు చేశారు. 'ది వయాన్స్ బ్రదర్స్' టెలివిజన్ సీరిస్‌తో పాటు 'ది బూండాక్స్' అనే ఎనిమేటేడ్ సినిమాకు వాయిన్ ఇచ్చారు. విథర్‌స్పూన్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు ఐస్‌క్యూబ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జనవరి 27, 1942న జన్మించిన విథర్‌స్పూన్‌కు భార్య ఏంజెలా, కుమారులు జేడీ, అలెగ్జాండర్ ఉన్నారు.