ఆ పుస్తకం.. కరోనా గురించి ముందే చెప్పిందా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2020 2:43 PM GMT
ఆ పుస్తకం.. కరోనా గురించి ముందే చెప్పిందా..!

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు యుద్దం చేస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో తెలియక అందరూ తలలుపట్టుకుంటున్నారు. వందకు పైగా దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 5,429 మంది మృత్యువాత పడగా.. 1,45,379 మంది బాధితులు పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2020లో కరోనా వైరస్‌ విజృంభిస్తుందని దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఓ పుస్తకంలో ప్రస్తావన ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్‌ నటి, మోడల్‌ కిమ్‌కర్థాషియాన్‌ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

'ఎండ్‌ ఆఫ్‌ డేస్‌' అనే పుస్తకంలో కరోనాని పోలిన దాని గురించి ఉన్నట్లు ట్విట్టర్‌ అభిమానులతో ఆమె పంచుకుంది. ఈ పుస్తకం గురించి తన సోదరి చెప్పిందని తెలిపింది. ప్రముఖ రచయిత సిల్వియా బ్రౌన్‌ 2008లో ఎండ్‌ ఆప్‌ డేస్‌ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఓ అంకంలో కరోనాని పోలీన లాంటిదాని గురించి రచయిత్రి ప్రస్తావించింది. 2020 సంవత్సరంలో తీవ్రమైన నిమోనియా లాంటిది ప్రజలను ఎంతో ఇబ్బందికి గురిచేస్తుందని, ఊపిరితిత్తులు, శ్వాసనాళ గొట్టాలపై దాని దాడి తీవ్రంగా ఉంటుంది. ఇది ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా నశిస్తుంది. కానీ మళ్లీ పదేళ్ల తర్వాత ఇదే మాదిరిగా దాడి చేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగవుతుందని ఆపుస్తకంలో ఉంది.



Next Story