వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుర్తున్నాడా.. నటి రంజిత, నిత్యానంద బంధానికి ఏ పేర్లు పెట్టుకున్నా.. నిత్యానందతో రంజిత రాసలీలలు సాగించిందనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. మహిళలను లైంగింకంగా వేధించాడని పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నిత్యానందను పట్టుకునేందుకు పోలీసులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఓ నటి నిత్యానందను కలవాలని తెగ ఆరాటపడుతోంది. స్వామిజీని కలిసి భక్తిలో నిమగ్నమవ్వాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమె మరెవరో కాదు నటి మీరామిథున్‌. మోడలింగ్‌ రంగం నుంచి సినిమాకు పరిచయమైన ఈ బామ ఇటీవలే తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలోనూ పాల్గొని ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది.

తాను ఎప్పటినుండో స్వామి నిత్యానందను కలవడానికి తెగ ప్రయత్నిస్తున్నానని.. స్వామి వారి భక్తిలో నిమగ్నమయ్యేందుకు ఆయన్ని కలవాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది. అంతేకాదు.. స్వామి వారు స్వయంగా రాసిన ‘లవింగ్ ఎన్ లైట్‌మెంట్’ అనే పుస్తకాన్ని చదువుతూ.. స్వామి వారు పుస్తకంలో కురిపించిన ప్రేమ సూక్తుల్ని పేజీలు తిప్పి మరీ చూపిస్తూ.. ఆయన ప్రేమకు ముగ్ధురాలినయ్యానంటూ వెంటనే ఆయన్ని కలవాలంటోంది’ అమ్మడు.

ఈ విషయం స్వామి వారి చెవిన పడకపోతుదా..? తనకు స్వామి వారి నుంచి పిలుపు రాకపోతుందా అని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది అమ్మడు. చూద్దాం.. అమ్మడి కోరికను నిత్యానంద తీర్చుతాడో లేదో మరీ..

తోట‌ వంశీ కుమార్‌

Next Story