ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి బీసీ కమిషన్ నోటీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 10:16 AM GMT
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి బీసీ కమిషన్ నోటీసులు

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్‌ను ఆర్టీసీ జేఏసీ కోరింది. అలాగే ఆర్టీసీలో 20 వేల మంది కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని.. వారిని డిస్మిస్‌ చేశామని రాష్ట్రం ప్రభుత్వం అంటోందని ఆర్టీసీ జేఏసీ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జాతీయ బీసీ కమిషన్‌ మెంబర్‌ టీ.ఆచారీ స్పందించారు. ఆర్టీసీ సమ్మె విషయంపై బీసీ జాతీయ కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌కు, ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్‌ ముందు పూర్తి నివేదికతో హాజరుకావాలని బీసీ జాతీయ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

Tsrtc Bc Tsrtc Bc1

Next Story