రజనీ 'దర్బార్' ఎంత వరకు వచ్చింది..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 10:27 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 'దర్బార్'. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో స్పెషల్ అని మురుగదాస్ చెప్పడం, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన తన షూటింగును రజనీ పూర్తి చేశారు.
ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవలే డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ మురుగదాస్ తెలియజేసారు. అంతే కాకుండా... రజనీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసారు. త్వరలోనే ఈ సినిమా మిగతా పనులను పూర్తి చేసుకోనుంది. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార కథానాయికగా నటించింది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. మరి.. ఎన్నో అంచనాలతో రాబోతున్న 'దర్బార్' ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.