సైనికున్ని మట్టుబెట్టిన 'ఆర్మీ'
By సుభాష్
థాయ్‌లాండ్‌లో ఓ సైకో సైనికుడిని ఆర్మీ హతమార్చింది. తుపాకీతో కాల్పులు జరిపి 20 మందిని చంపేసిన సర్జంట్ మేనేజర్ జక్రపంత్ ను ఆదివారం సైనికులు కాల్చి చంపారు. థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం సాయంత్రం జక్రపంత్ తొమ్మా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. సైనిక కార్యాలయంలో ఉన్న ఓ వాహనాన్ని దొంగిలించి నగరంలో నడుపుకొంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21 మాల్‌లో చొరబడి మెషీన్ గన్‌తో అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 20 మందికి ప్రాణాలు కోల్పోగా, 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని షాపింగ్ మాల్‌కు ఉన్న ద్వారాలన్ని మూసివేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పలువురు అతన్ని బంధించారు. నిర్భందంలోకి తీసుకున్న సైనికులు.. ఉన్మాదిగా మారిని సైనికుడిని హతమార్చారు.
కాగా, దాడి జరుగుతున్న సమయంలో అనుమానితుడు తన ఫేస్ బుక్ ఖాతాలో ‘నేను లొంగిపోవచ్చా’ అంటూ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అంతకు ముందు ఒక పిస్టల్, మూడు బుల్లెట్లు ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు.