విమానంలో ఉగ్రవాది.. ప్రయాణికుడి హల్‌చల్‌

By సుభాష్  Published on  23 Oct 2020 6:50 AM GMT
విమానంలో ఉగ్రవాది.. ప్రయాణికుడి హల్‌చల్‌

ఓ విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ ఓ ప్రయాణికుడు హల్‌ చల్‌ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..జియో ఉల్‌ హక్‌ (30) అనే వ్యక్తి తాను స్పెషల్‌ సెల్‌ అధికారిని.. విమానంలో టెర్రరిస్టు ఉన్నాడంటూ హల్‌ చల్‌ చేశాడు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు, అధికారులు అటెన్షన్‌కు అయ్యారు.

ఇక డబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అతడిని సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. విచారణలో జియో ఉల్‌ హక్‌కి మతి స్థిమితం సరిగాలేదని తేలింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనిని పనాజీలోని మానసిక కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story
Share it