వీసా నిబంధనలు సడలించిన కేంద్ర సర్కార్‌

By సుభాష్  Published on  22 Oct 2020 2:41 PM GMT
వీసా నిబంధనలు సడలించిన కేంద్ర సర్కార్‌

కేంద్ర సర్కార్‌ వీసా నిబంధనలు సడలించింది. అన్ని వర్గాల విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పర్యాటకం కోసం భారత్‌లో విజిట్‌ చేసేందుకు విదేశీయులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్నవారితో పాటు విదేశీయులకు ఈ అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. పౌర విమానయాన శాఖ ఆమోదించిన విమానాలకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఎలక్టానిక్‌, టూరిస్ట్‌, మెడికల్‌ వీసాలు తప్ప ఇతర అన్ని వీసాలను పునరుద్దరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలతో బిజినెస్‌, కాన్ఫరెన్స్‌, విద్య, పరిశోధన, వైద్య, ఉద్యోగం సంబంధిత అంశాలకు హాజరయ్యేందుకు విదేశీయులకు అనుమతి ఇచ్చారు. అలాగే కోవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణికులు కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Next Story
Share it