టోల్‌ ప్లాజా వద్ద పోలీసులపై రెచ్చిపోయిన ఉగ్రవాదులు

By సుభాష్
Published on : 31 Jan 2020 8:48 AM IST

టోల్‌ ప్లాజా వద్ద పోలీసులపై రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూలో ఉగ్ర కాల్పులు తీవ్ర సంచలనం రేపింది. జమ్మూకశ్మర్‌ జాతీయ రహదారిపై నగరోతా టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉదయం ఐదున్నర గంటల సమయంలో శ్రీనగర్‌ వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై ఎదురు కాల్పులకు దిగారు.

ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తప్పించుకుని అడవుల్లోకి పరారయ్యారు. అలాగే ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో ప్రత్యేక బలగాలను రప్పించి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పుల కారణంగా జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిషేధించారు.

Next Story