క‌శ్మీరులో చెల‌రేగిన ఉగ్ర‌మూక‌లు.. ఐదుగురు కూలీల‌ను అత్యంత దారుణంగా..

By Medi Samrat
Published on : 30 Oct 2019 12:51 PM IST

క‌శ్మీరులో చెల‌రేగిన ఉగ్ర‌మూక‌లు.. ఐదుగురు కూలీల‌ను అత్యంత దారుణంగా..

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఉగ్రవాదులు చెల‌రేగిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా కాల్పులకు తెగ‌బ‌డ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో వలసకూలీలపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో బెంగాల్‌కు చెందిన అయిదుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రదాడిలో చనిపోయినవారు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. కశ్మీరుకు వలసవచ్చిన వీరంతా తాపీ పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే.. యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం కశ్మీర్‌‌లో పర్యటించిన రోజే ఈ దుశ్చర్యకు ఉగ్రవాదులు పాల్పడటం గమనార్హం. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం కుల్గాం ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టినట్లు జమ్మూ-కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు.

Next Story