ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను మార్చినట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు.

కొత్త షెడ్యూల్‌ ఇలా ఉంది

మార్చి 31 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 1 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 3 సెకండ్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్‌ 4 ఇంగ్లీష్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 6 ఇంగ్లీష్ 2
ఏప్రిల్‌ 7 మ్యాథమేటిక్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 8 మ్యాథమేటిక్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 9 జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 11 జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 13 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 15 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.