'తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్' రిలీజ్ డేట్ ఫిక్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 5:48 AM GMT
తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ రిలీజ్ డేట్ ఫిక్స్

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' ట్యాగ్ లైన్‌. జ‌వ్వాజి రామాంజ‌న‌యులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. సినిమా టైటిల్ సాంగ్‌ను ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి సంగ‌మేశ్వ‌ర సినిమాస్ థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు.

అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ టైటిల్ సాంగ్‌ను సోష‌ల్‌మీడియాలో విడుద‌ల చేశారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. హీరోయిన్ సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమా పై సందీప్ కిష‌న్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి.. ఈ మూవీ అయినా సందీప్ కి విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Next Story