నిర్భయ దోషులకు తలారీగా ఉంటా..!

By Newsmeter.Network
Published on : 5 Dec 2019 12:10 PM IST

నిర్భయ దోషులకు తలారీగా ఉంటా..!

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తనను తాత్కాలిక తలారిగా నియమించాలంటూ ఓ వ్యక్తి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాసాడు. దోషులకు తక్షణమే శిక్ష అమలవ్వాలంటే తనకు అనుమతి ఇవ్వాలంటూ సిమ్లాకు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి ఈ లేఖ రాశాడు. దోషులకు ఇప్పటికైనా ఉరి శిక్ష అమలైతే నిర్భయ ఆత్మశాంతిస్తుందని రవికుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తిరస్కరిస్తూ పంపిన ఫైల్‌ కేంద్ర హోం శాఖకు చేరింది. దానిని త్వరలో రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి పరిశీలించి, తుది నిర్ణయం ప్రకటిస్తారు. క్షమాభిక్షకు రాష్ట్రపతి తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులకు తక్షణమే ఉరి శిక్ష అమలవుతుంది. అయితే తిహార్‌ జైలులో తలారి లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రవికుమార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.



Next Story