ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఇక ఇప్పుడు సరికొత్త కిక్ ఇవ్వడానికి మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 90ML. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు  శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర‌ యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ ఈవెంట్ లా ఉంది. ఇంతగా సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు హీరో కార్తికేయ‌. ఈ సినిమా గురించి చెబుతూ… మొదట దర్శకుడు శేఖర్ వేరే కథ చెప్పారు. ఆ తరువాత ఫస్ట్ హాఫ్ వరకు సెట్ చేసుకున్న 90ML అనే కథ చెప్పారు.

మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి అలాగే మందు వాసన అంటే పడని ఒక తండ్రి యొక్క కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ అనగానే నాకు బాగా నచ్చేసింది. అప్పుడు ఫస్ట్ హాఫ్ ఒక్కటే చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి 90ML టైటిల్ అనగానే డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడే మంచి బడ్జెట్ లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్ లో సినిమాని నిర్మించడం జరిగిందన్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి హీరో అవ్వాలని అనుకున్నా. నేను చేసిన ప్రతి సినిమాలో నేను అంత బాగా నటించడానికి కారణం నా దర్శకులు. నా పేరెంట్స్ అలాగే నా బాబాయ్ నా కోసం మరోసారి సపోర్ట్ చేశారు. వీళ్ళే నా బ్యాక్ గ్రౌండ్. ఆర్ఎక్స్ 100తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాము. ఇక ఇప్పుడు సినిమా చూశాక త్రిబుల్ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పుకొచ్చారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్