ఛీ పాడు.. 'డేటింగ్ సీక్రెట్స్' చెప్పిన తెలుగు లేడీ సింగర్ - పెళ్లికంటే ముందు..!
By అంజి
ఛీ పాడు.. ఏంటో ఈ తరం కుర్ర కారు! పెళ్లంటే అస్సలు సిగ్గు, శరం లేకుండా వ్యవహరించేస్తున్నారు. చక్కగా పెద్దలు చూసిన సంబంధం చేస్కోక. పార్కులు, రెస్టారెంట్‌ల వెంట తిరిగినంత మాత్రాన వాడు చెడ్డోడో.. మంచోడో ఎలా తెలుస్తుంది? నీ విషయం నాకొక్క దానికే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇకనైనా బుద్ధిగా ఉండు. ఇంటిపట్టునే ఉండి మమ్మీ, డాడీ చూసిన వాడినే పెళ్లి చేస్కో. కాదూ కూడదని తింగరి వేషాలేశావో ఇంట్లో వాళ్లకు చెప్పి మక్కెలిరగొట్టిస్తా అంటూ తన మనుమరాలి డేటింగ్ విషయం తెలిసిన 65 ఏళ్ల బామ్మ కుర్చీలో కూర్చొని టాకింగ్ ఫైట్ మొదలెట్టేసింది.
అప్పటి వరకు యాంగ్రీ ఉమెన్ అవతారమెత్తిన బామ్మను చూసి నిల్చొండిపోయిన మనుమరాలు చనువుకొద్దీ ఆమె కాళ్లవద్ద కూర్చొని తన మనసులోని మాటలు చెప్పసాగింది. బామ్మను గారాబం పడుతూ నన్నేం చేయమంటావ్ చెప్పు. మీ పాత కాలపు రోజులు కావివి. ఇంట్లో ఒకలా.. బయట మరొకలా వ్యవహరించే మనుషులు తిరుగుతున్న రోజులివి. ఆ కారణంగానే దిశ వంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాంతో అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎవరి జాగ్రత్తలో వారున్నారు. ఒక్క రోజులో జరిగే పెళ్లి చూపుల్తో వరుడు ఎలాంటి వాడో డిసైడ్ చేయలేకనే ఈ డేటింగ్ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు.
కాబోయే వాడి మైండ్‌సెట్‌ను క్యాప్చర్ చేయడానికే పార్కులు, రెస్టారెంట్‌లు తిరుగుతామే తప్పా వాడితో ముద్దూ.. ముచ్చట తీర్చుకోనికి కాదే ముసలిదానా అంటూ బామ్మతో తనకున్న చనువును ప్రదర్శించింది మనుమరాలు. మనుమరాలి మాటలతో కాస్త నెమ్మదించిన బామ్మ నిజమేనే! ఇటీవల అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యాచారాలు ఎక్కువయ్యాయి. తెలిసిన వారిని సైతం నమ్మలేని పరిస్థితి. నువ్వు చెప్పినట్టు కాలం మారింది. కల్ముషం లేని మనుషులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూమి అంతరించిపోయే ముందు ఇటువంటి సూచనలు కనపడతాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కూడా. ఏదేమైనా రోజులంటే మావేనే. ''ఏదేమైనా తన డేటింగ్‌పై బామ్మ నుంచి గ్రీన్ సిగ్నల్‌నే రాబట్టింది మనుమరాలు''.
ఇలా డేటింగ్‌పై సమాజంలో భిన్నాభిప్రాయాలు వినపడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి సైతం ఓపెన్ అయిపోయింది. ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్లి మరీ తన డేటింగ్ సీక్రెట్స్ చెప్పేసింది. అదేంటి తన ప్రొఫెషన్‌లోనే ఉన్న హేమ చంద్రను పెళ్లి చేసుకుంది కుందా! అటువంటి శ్రావణ భార్గవి పెళ్లికి ముందు వేరొకరితో డేటింగ్ చేసిందా? అని మీరు ఊహా లోకానికి వెళ్తే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే పెళ్లికి ముందు శ్రావణ భార్గవి డేటింగ్ చేసింది తన భర్త హేమచంద్రతోనే. ఈ విషయాన్నే టీవీ షోలో బయటపెట్టింది.
క్యాష్ ప్రోగ్రామ్‌లో..
కాగా, సుమ యాంకర్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రామ్‌లో తాజాగా శ్రావణ భార్గవి, హేమ చంద్ర పాటిస్పేట్ చేశారు. షోలో భాగంగానే సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రావణ భార్గవి తన డేటింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. పెళ్లికంటే ముందు మూడేళ్లు డేటింగ్ చేశాం. ఫస్ట్ డే మేమిద్దరం చూసుకున్నప్పుడు ప్రేమ పుట్టింది. కళ్లల్లోకి కళ్లుపెట్టి మరీ చూసుకున్నాం. సాంగ్ రికార్డింగ్ సమయాల్లో నేను వెళ్లినప్పుడు హేమ చంద్ర ఇంట్లో ఉండి పాపను చూసుకుంటాడు. డేటింగ్ సమయంలో ఎలా ఉన్నామో ఇప్పడూ అలానే ఉన్నామంటూ శ్రావణ భార్గవి చెప్పుకొచ్చింది. దీంతో వెరీ క్యూట్ కపుల్ అంటూ సోషల్ మీడియాలో సైతం వీరిపై కామెంట్లు కనపడుతున్నాయి.