'సైనికుడి' పాత్రలో నటించిన తెలుగు హీరోలు వీరే

By సుభాష్  Published on  26 Jan 2020 10:55 AM GMT
సైనికుడి పాత్రలో నటించిన తెలుగు హీరోలు వీరే

జై జవాన్‌.. జై కిసాన్‌ అని చెప్పినట్లు దేశానికి రైతుతో పాటు సైనికుడు కూడా వెన్నుముక అనే చెప్పాలి. ఇక సైనిక పాత్రలో ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. ఇక తాజాగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో మహేష్‌ బాబు సైనికుడి పాత్రలో నటించారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగులో సైనిక పాత్రలో వచ్చిన సినిమాలు ఏవో ఓసారి చూసేద్ధాం.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్‌బాబు మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రకు జీవం పోశారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. అలాగే 'వెంకీ మామ' సినిమాలో మొదటి సారిగా అక్కినేని నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటించి మెప్పించారు. ఇక అల్లు అర్జున్‌ కూడా 'సరైనోడు', 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీలో సైనిక పాత్రలో నటించారు. ఈ సైనిక పాత్రకు అల్లు అర్జున్‌కు మంచి పేరే వచ్చింది. సాయికుమార్‌ ఆపరేషన్‌ గోల్‌డ్‌ఫిష్‌లో ఎన్‌ఎస్‌జీ కమెండోగా నటించి అదరగొట్టారు. ఆకాష్‌పూరీ కూడా 'మెహబూబా' సినిమాలో సైనికుడిగా నటించి మెప్పించారు. ఇక మోహన్‌లాల్‌, అల్లు శిరీష్‌ ‘యుద్ధభూమి‘ సినిమాలో సైనిక పాత్ర పోషించారు. ఇక క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కంచె' సినిమాలో వరుణ్‌ తేజ్‌ సైనిక పాత్ర పోషించారు. రానా కూడా 'ఘాజీ' సినిమాలో నేవీ ఆఫీసర్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అలాగే పవన్‌ కల్యాణ్‌ కూడా 'కొమరంపులి' సినిమాలో ఎన్‌ఎస్‌జీ కమెండోగా నటించారు. ఎన్టీఆర్‌ కూడా 'శక్తి' సినిమాలో ఎన్‌ఎస్‌జీ కమెండో పాత్రలో నటించారు. నందమూరి బాలకృష్ణ కూడా మంగమ్మ గారి మనవడు, విజయేంద్ర వర్మ, పరమ వీరచక్ర సినిమాల్లో సైనికుడిగా నటించారు.

ఇక యుద్ధభూమి, స్టాలిన్‌ సినిమాలలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా సైనికుడి పాత్రలో అందరిని మెప్పించారు. మగాడు, రాజసింహ, ఎవడైతే నాకేంటి వంటి సినిమాల్లో నటుడు రాజశేఖర్‌ సైనిక పాత్ర పోషించి అందరిని మెప్పించారు. సాయికుమార్‌ పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించారు. అడవిలో అభిమన్యుడు సినిమాలో జగపతిబాబు, వినోద్‌ కుమార్‌లు సైనిక పాత్రలో పోషించారు. ఇక స్నేహమంటే ఇదేనా సినిమాలో సుమంత్‌ కూడా సైనికుడి పాత్రలోనటించారు.

శ్రీశైలం సినిమాలో మిలటరీ ఆఫీసర్‌గా నటించారు. సుమన్‌ కూడా 'వన్‌ మ్యాన్‌ ఆర్మీ' సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. ఇక సురేష్‌ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన 'మేస్త్రీ' సినిమాలో మోహన్‌బాబు, దాసరి నారాయణరావులు కూడా సైనికుడి పాత్రలో నటించారు. కింగ్‌ నాగార్జున కూడా 'జైహింద్‌' సినిమాలో సైనికుడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ కూడా 'బొబ్బిలిపులి', 'మేజర్‌ చంద్రకాంత్‌' సహా పలు సినిమాల్లో సైనికుడిగా నటించి ఈ పాత్రకు పేరు తీసుకువచ్చారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా 'భారత సింహం'లో బ్రిగేడియర్‌ పాత్రలో నటించారు. ఇక 'మహసంగ్రమం' సినిమాలో శోభన్‌బాబు సైనికుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే 'భారతరత్న' సినిమాలో విజయశాంతి ఆర్మీ మేజర్‌గా నటించారు.

Next Story