మహేష్‌బాబుకు సర్జరీ.. మూడు నెలలు అక్కడే..

By అంజి  Published on  25 Jan 2020 11:05 AM GMT
మహేష్‌బాబుకు సర్జరీ.. మూడు నెలలు అక్కడే..

టాలీవుడ్‌ అగ్ర హీరో మహేష్‌బాబు తాజాగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీస్‌ వద్ద సెన్సెషనల్‌ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మహేష్‌ బాబు తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. అమెరికాలో మహేష్‌కు బాబుకు సర్జరీ జరగబోతోందని సమాచారం. ఇందు కోసం మహేష్‌ బాబు అక్కడే మూడు నెలలు ఉండనున్నారు. గత ఐదేళ్ల క్రితం వచ్చి 'ఆగడు' సినిమా చిత్రీకరణలో మహేష్‌ బాబు మోకాలికి గాయమైంది. అయితే ఆ గాయం ఇప్పటి మహేష్‌ కోలుకోలేదట. తరచూ గాయం నొప్పితో మహేష్‌ ఇబ్బందికి గురయ్యేవాడంట. దీంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించడంతో మహేష్‌ అమెరికాకు వెళ్లారని టాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సర్జరీ తర్వాత మహేష్‌ రెండు నుంచి మూడు నెలలు రెస్ట్‌ కోసం అక్కడే ఉంటారని టాక్‌. ఆ తర్వాతే మహేష్‌ నెక్ట్స్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ తన తర్వాత సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా మే లేదా జూన్‌లో ప్రారంభం కానుంది. మహేష్‌ సరసన మరో కియారా అద్వానీకి ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. తన సర్జరీపై వస్తున్న వార్తలపై మహేష్‌ బాబు ఇప్పటి వరకు స్పందించలేదు. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

Next Story
Share it