'ఇద్ద‌రి లోకం ఒక‌టే'.. రాజ్ త‌రుణ్ కి విజ‌యాన్ని అందించేనా..?

By Newsmeter.Network  Published on  17 Dec 2019 5:53 AM GMT
ఇద్ద‌రి లోకం ఒక‌టే.. రాజ్ త‌రుణ్ కి విజ‌యాన్ని అందించేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మై.. కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావ చిత్రాల‌తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో రాజ్ త‌రుణ్‌. ఆత‌ర్వాత ఫ్లాప్స్ రావ‌డంతో కెరీర్ లో వెన‌క‌బ‌డిన రాజ్ త‌రుణ్ తాజాగా ఇద్ద‌రి లోకం అనే సినిమా చేసాడు. రాజ్ తరుణ్ , షాలిని పాండే హీరో, హీరోయిన్లుగా ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందిన ఈ లవ్‌ ఎంటర్‌టైనర్ ఇద్దరి లోకం ఒకటే చిత్రానికి జీ.ఆర్‌.కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ప్రేమ‌క‌థ‌లు చాలా వ‌చ్చాయి క‌దా..? ఇందులో ఉన్న కొత్త‌ద‌నం ఏంటి అని రాజ్ త‌రుణ్ అని అడిగితే... ఇద్ద‌రి లోకం ఒక‌టే ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌. ల‌వ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్‌ అనే ట‌ర్కీ సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా చేశాం. నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా కాదు. సినిమా అంతా స్వ‌చ్ఛ‌మైన ప్రేమకథే ఉంటుంది. మాతృకలో ఎమోష‌న్స్‌, మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమా చేశాం.

డైరెక్ట‌ర్ జీఆర్‌.కృష్ణ, బెక్కం వేణుగోపాల్ గారు ఫోన్ చేసి 'ల‌వ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్‌' మూవీ చూడమని చెప్పారు. అలా సినిమా చూశాను. నాకు బాగా న‌చ్చింది. త‌ర్వాత స్క్రిప్ట్‌ లో మన ఆడియన్స్ కి తగ్గట్లు కొన్ని చేంజెస్ చేసి నాకు చెప్పారు అవి కూడా బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ సినిమా దిల్ రాజు బేనర్ లో చేస్తున్నాం అని చెప్ప‌గానే మ‌రింత హ్యాపీగా ఫీల‌య్యాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన ప్రేమ‌క‌థ‌ల్లో నా క్యారెక్టర్ జోష్‌గా, లౌడ్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ముఖ్యంగా చివ‌రి 30 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఖ‌చ్చితంగా విజ‌యాన్ని అందిస్తుంద‌ని రాజ్ త‌రుణ్ చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. రాజ్ త‌రుణ్ న‌మ్మ‌కం నిజ‌మౌతుందో లేదో ఈ నెల 25న తెలుస్తుంది.

Next Story
Share it