నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్ లో రాబోతున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రూలర్’. కాగా తాజాగా బాలయ్య సినిమాకి సెన్సార్ పూర్తయింది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సెన్సార్ రిపోర్ట్స్ అయితే పాజిటివ్ గానే వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే రైతుల ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట. అలాగే పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య అద్భుతంగా నటించాడని.. కొన్ని సన్నివేశాల్లో ఏడిపిస్తాడని అని కూడా సెన్సార్ బృందం చెబుతుంది.

కె.ఎస్‌.రవికుమార్‌ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. గతంలో ఈ దర్శకుడి సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఈ రోజు ‘హీరోయిన్ వేదిక’ చేత మీడియాకి ఇంటర్వ్యూ ఇప్పించారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా పై ఆడియన్స్ లో మాత్రం పెద్దగా బజ్ రాలేదు. చిత్రబృందం సెకండ్ ట్రైలర్ ను పవర్ ఫుల్ గా కట్ చేసి వదిలినప్పటికీ అది కూడా తేలిపోయింది. ఇప్పటికే బాలయ్య చిత్రాల్లో అలాంటి యాక్షన్ అండ్ డైలాగ్స్ చాలా ఉండటంతో సెకండ్ ట్రైలర్ కూడా బోర్ గానే సాగింది.
కాగా ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.