త్వరగా కానివ్వు.. అవతల ఇంకో బేరం ఉండాది!
By సుభాష్ Published on 1 Feb 2020 9:19 AM ISTఏందబయా.. అట్టా సూస్తుండావా! ఎదురున్నా ఆలస్యం సేస్తుండావే. ఇంతకీ మన కేటగిరీ ఓన్లీ సూసుడేనా ఏందీ! వచ్చిన పనేదో కానిస్తే నే ఇంకో బేరం సూస్కోనికి బాగుంటాది కదా! అసలే అన్ సీజనూ! నువ్వట్టా సూస్తా నిల్సొంటే నీకు టైమేస్టు.. నేనేమో ఇంటికి ఖాళీ సిప్పెత్తుకు పోవాల్సి వస్తాది. అయినా, ఇంత కొత్త సరుకును ఎదురు పెట్టుకుని ఆలోచించే వాడిని నిన్నే సూస్తుండా! బేరం ఆడితే తగ్గిస్తాలే!
అసలే ఈ వ్యాపారానికి రంగమ్మ కొత్త. తన అనుభవ రాహిత్యం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరోపక్క ఇంటి చుట్టూరా తిరుగుతున్న అప్పులోళ్లు. వారు కాస్తా నిమిషానికొకసారి గుర్తుకొస్తుండటంతో తన వ్యాపారాన్ని మరింత షురూ చేసింది. స్టాకన్నది లేకుండా ఏ రోజుకారోజు కొత్త కొత్త సరుకుతో దర్శనమిస్తోంది. కొత్త సరుకన్నాక కస్టమర్లు ఊరుకుంటారా! ఈగలు వాలినట్టు వాలారు. దాంతో రంగమ్మ సరుకు ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంది. మళ్లీ మళ్లీ కొత్త సరుకు వస్తూనే ఉంది.
వ్యాపారంలో ఫైనల్ మెళుకువలు నేర్చిన రంగమ్మకు ఖాళీ బుట్టతో వెళ్తున్న రమణ కంటపడ్డాడు. కూరగాయలు కొనేందుకే బజారుకొచ్చాడని గ్రహించి తన కొట్టులోని సరుకులన్నింటిని ఆ బుట్టలో నింపి ఆ రోజుకు త్వరగా దుకాణం సర్దెయ్యాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం ఓ అబయా.. ఓ అబయా ఇటు రా అంటూ తన కొట్టుకు పిలిచింది. అటుగా అడుగులు వేసిన రమణ కూరగాయలన్నీ ఫ్రెష్షేనా? కాదా? అని తనివి తీరా చూస్తుండగా, ఇంతలో కలగజేసుకున్న రంగమ్మ ఏందబయా.. అట్టా సూస్తుండావు అంటూ మాటలు కలిపి చాకచక్యంగా రమణ బుట్టను తన కొట్టులోని కూరగాయలతో నింపేసింది. ఇంకేముంది ఆ రోజుకు బేరం అయిపోవడంతో పైసలు లెక్కెట్టుకుంటూ ఇంటి బాట పట్టింది రంగమ్మ.
సేమ్ టు సేమ్ రంగమ్మ సిట్యువేషన్‌నే మన టాలీవుడ్ భామలు ఎదుర్కొంటున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, టాలీవుడ్‌కు దిగుమతవుతున్న కొత్త హీరోయిన్లలో నూటికి 90 శాతం మంది తొలి చిత్రానికే పరిమితమవుతున్నారు. ఆ తదుపరి తెరపై కనిపించకపోగా గూగుల్ సెర్చ్ ఇంజన్‌కు సైతం దొరకనంతగా కనుమరుగవుతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఇక మిగిలిన 10 శాతం మంది చాకచక్యంగా సరుకులు అమ్మిన రంగమ్మ మాదిరి వారి అంద చందాల ఫోటోలను ఎరగా వేసి అవకాశాలను దక్కించుకుంటున్నారన్నది ప్రపంచం ఎరిగిన సత్యం.అందుకు వారికి సాయంగా సోషల్ మీడియా ఉండనే ఉందాయే! అటువంటి వారిలో మన జార్జిరెడ్డి బ్యూటీ ముస్కన్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్నా ఏటి..?