ఈ నెల 21న మరో కీలక భేటీకి సిద్ద‌మ‌వుతున్న‌ వైఎస్‌ షర్మిల

YS Sharmila Meet Khammam Leaders On Feb 21. ది‌వంగ‌త మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల మరో కీలక భేటికి సిద్ధమయ్యారు.

By Medi Samrat  Published on  11 Feb 2021 9:34 AM GMT
YS Sharmila

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ సంచ‌ల‌నానికి తెర‌లేపిన ది‌వంగ‌త మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల మరో కీలక భేటికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్‌ అభిమానులతో‌ లోటస్‌పాండ్‌లోని నివాసంలో భేటీ అయిన ఆమె.. ఈ నెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ​సమావేశమ‌వ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ విష‌య‌మై ప్ర‌స్తుతం ష‌ర్మిల వెంట ఉన్న తెలంగాణ నేత‌ కొండా రాఘవరెడ్డి గురువారం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఖమ్మంలోని ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా గిరిజనులతో షర్మిల ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలిపారు. భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌, ఏం చేయాలి అనేదానిపై ఈ సమావేశంలో జిల్లా నేతలతో చర్చించనున్నారని వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్‌‌ అభిమానులతో భేటీ అయిన ఆమె.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వారితో చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ‌లోని ప్రతీ జిల్లాకు చెందిన నేతలను కలుస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల‌ 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, అభిమానులను ష‌ర్మిల క‌లువ‌నున్నారు.


Next Story
Share it