రేపే షర్మిల నిరాహారదీక్ష.. అనుమతి వ‌చ్చేసిందిగా..

YS Sharmila Hunger Strike From Tomorrow. రేపు షర్మిల నిరాహారదీక్షను చేపట్టబోతున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని

By Medi Samrat  Published on  14 April 2021 11:37 AM GMT
YS Sharmila

తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించనున్న వైయస్ షర్మిల.. అందుకు త‌గ్గ‌ట్టుగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించిన షర్మిల.. ఇప్పుడు మరో సంచలన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన సభలో ఆమె ప్రకటించిన విధంగా.. రేపు ఆమె నిరాహారదీక్షను చేపట్టబోతున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే నిరాహారదీక్ష చేస్తానని ఆమె ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు. చెప్పిన విధంగానే ఆమె ఇప్పుడు దీక్షకు సిద్ధమయ్యారు.

అయితే.. తొలుత ఆమె మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేయాలని భావించిన్నప్పటికీ.. పోలీసులు ఒక రోజు దీక్షకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఒక్క‌రోజు నిరాహారదీక్ష చేసేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. షర్మిల నిరాహారదీక్ష నేపథ్యంలో, తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది.


Next Story