తెలంగాణలో రైతులకు గౌరవం లేదు : వైఎస్ షర్మిల

YS Sharmila Fire On Telangana Govt. హుస్నాబాద్ నియోజక వర్గం సైదాపూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతుంది.

By Medi Samrat  Published on  18 Nov 2022 2:37 PM IST
తెలంగాణలో రైతులకు గౌరవం లేదు : వైఎస్ షర్మిల

హుస్నాబాద్ నియోజక వర్గం సైదాపూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు గౌరవం లేదని.. పండించిన పంట గిట్టు బాటు లేదని అన్నారు. తాలు తరుగు అని రైతుల‌ను నిండా ముంచుతున్నార‌ని.. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కౌలు రైతు తెలంగాణలో రైతే కాదు అంటున్నార‌ని ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ఉద్యోగాల పేరుతో 8 ఏళ్లుగా మోసమే.. ఉద్యోగాల కోసం సాదించుకున్న తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? అని ప్ర‌శ్నించారు.

నోటిఫికేషన్ లు ఇవ్వండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్నా.. కేసీఅర్ లో చలనం లేదని విమ‌ర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఏ వర్గానికి బ్రతుకే లేని తెలంగాణ గా చేశారని మండిప‌డ్డారు. బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు స్వార్థ పూరిత రాజకీయ పార్టీలు.. మాట మీద నిలబడే నాయకుడు లేడని అన్నారు. వైఎస్సార్ పథకాలు ఖూనీ చేశారు.. వైఎస్సార్ పాలన ఈ గడ్డ పై మళ్ళీ రావాలి.. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా.. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తాన‌ని ష‌ర్మిల అన్నారు.


Next Story