Vikarabad: హాడలెత్తిస్తున్న యువత.. పోలీస్ సైరన్ వేసుకుంటూ కార్లతో స్టంట్స్‌

హైదరాబాద్‌ నగర శివారులో యువత కార్ల రేసింగ్‌తో రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. యువకులు బైకులపై వింత వింత విన్యాసాలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు.

By అంజి  Published on  16 Aug 2023 11:30 AM IST
Anantgiri Hills, Vikarabad, car racing

Vikarabad: హాడలెత్తిస్తున్న యువత.. పోలీస్ సైరన్ వేసుకుంటూ కార్లతో స్టంట్స్‌

హైదరాబాద్‌ నగర శివారులో యువత కార్ల రేసింగ్‌తో రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. యువకులు బైకులపై వింత వింత విన్యాసాలు చేస్తూ హల్చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది యువకులు వారి కార్లతో స్టంట్లు చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ అనంతగిరి హిల్స్‌లో యువకుల కార్ రేసింగ్ చేస్తూ నానా హంగామా సృష్టించారు. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో యువకులందరూ కార్లు తీసుకొని అనంతగిరి హిల్స్ కి భారీగా చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన యువకులందరూ వారి కార్లలో పోలీస్ సైరన్ వేసుకుంటూ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా రచ్చ రచ్చ సృష్టించారు.

అది చూసిన స్థానికులు వింత వింత విన్యాసాలతో, స్టంట్‌లతో యువకులు చేస్తున్న హంగామాకి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీకెండ్స్‌లో రెగ్యులర్‌గా కార్ రేసింగ్‌లు జరుగుతున్నాయంటూ పోస్ట్ పెట్టారు. కార్ రేసింగ్ స్పాట్ పై దృష్టి పెట్టాలంటూ పోలీసులకి విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవైపు సైట్ సీయింగ్ కోసం కొంతమంది వారి కుటుంబ సభ్యులతో కలిసి అనంతగిరి ఫారెస్ట్‌కు వెళ్తూ ఉంటే మరోవైపు యువత కార్ రేసింగ్‌తో హడలెత్తిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు రేసింగ్‌లతో టూరిస్ట్‌లను, స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. కార్ రేసింగ్ కోసం ఎయిర్ గన్స్ వాడుతున్నట్లు అనుమానం. వికారాబాద్ జిల్లాలో యువత చేసిన కార్ రేసింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

Next Story