Godavarikhani: మద్యం మత్తులో యువతి హల్‌చల్.. డబ్బులు అడిగిన ఆటో డ్రైవర్‌పై దాడి
మద్యం మత్తులో ఓ యువతి ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. ఈ ఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 27 March 2023 1:00 PM ISTGodavarikhani: మద్యం మత్తులో యువతి హల్‌చల్.. డబ్బులు అడిగిన ఆటో డ్రైవర్‌పై దాడి
మద్యం మత్తులో ఓ యువతి ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. ఈ ఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. ఆటో ఛార్జీలు చెల్లించాలని యువతిని కోరడంతో హంగామా సృష్టించి రాళ్లతో దాడి చేసింది. ఈ సంఘటనను చూసిన స్థానికులను షాక్‌కి గురిచేసేలా ఆమె ఆటో డ్రైవర్‌ని అసభ్య పదజాలంతో దుర్భాషలాడింది. గోదావరిఖని టౌన్‌లోని ప్రధాన జంక్షన్‌లో జరిగిన ఈ ఎపిసోడ్‌ను స్థానికులు తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేయగా, కొద్దిసేపటికే వీడియో వైరల్‌గా మారింది. సదరు మహిళ కరీంనగర్ నుండి గోదావరిఖనికి ఆటో ఎంగేజ్ మాట్లాడుకుంది. అందుకు రూ.1200 బేరం కూడా కుదుర్చుకుంది. ప్రయాణ సమయంలో ఆటో డ్రైవర్ డీజిల్ నింపడానికి కొంత డబ్బు అడిగాడు. అయితే గోదావరిఖనికి వెళ్లాక డబ్బులు ఇస్తానని మహిళ చెప్పింది.
దీంతో చేసేదేమీ లేక ఆటో డ్రైవర్ తన దగ్గర ఉన్న డబ్బులతో పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ పోయించుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడుతూ తన దగ్గర డబ్బులు లేవని బెదిరించడం ప్రారంభించింది. అక్కడితో ఆగకుండా సమీపంలోని రాళ్లను తీసి ఆటో డ్రైవర్‌పైకి విసిరింది. ఆమె ప్రవర్తనకు చూపరులు ఆశ్చర్యపోయారు. అతడిని ఆమె దాడి నుండి రక్షించడానికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇప్పించారు. మహిళ మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వ్యహరించినట్లు స్థానికులు చెప్పారు. అయితే కొంతమంది యువత మద్యం మత్తులో రోడ్లపై హల్ చల్ సృష్టిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.