ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లిచేసుకున్న‌ యువకుడు

Young man married Transgender in Bhadradri Kothagudem district.ప్రేమ.. ఎప్పుడు, ఎవ్వ‌రి మ‌ధ్య ఎలా పుడుతుందో ఎవ్వ‌రు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 2:15 AM GMT
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లిచేసుకున్న‌ యువకుడు

ప్రేమ.. ఎప్పుడు, ఎవ్వ‌రి మ‌ధ్య ఎలా పుడుతుందో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. ఇదో అద్భుత‌మైన అనుభూతి. ప్రేమ గురించి ఎవ్వ‌రికి తోచిన విధంగా వారు నిర్వ‌చిస్తుంటారు. ప్రేమ ఉంటే చాలు.. ఇంకేం వ‌ద్దు అంటుంటారు కొంద‌రు. ఇక ప్రేమ‌కి కులం, మ‌తం మాత్ర‌మే కాదు లింగ‌భేదం అడ్డురాద‌ని నిరూపించారు ఈ ఇద్ద‌రు. ఓ యువ‌కుడు, టాన్స్ జెండ‌ర్ గ‌త కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గ‌త మూడు నెల‌లుగా స‌హ‌జీవ‌నం చేస్తూ..ఇరు కుటుంబాల వాళ్ల‌ను ఒప్పించి శుక్ర‌వారం పెళ్లి చేసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. భూపాల‌ప‌ల్లికి చెందిన రూపేష్‌, భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల మ‌ధ్య మూడేళ్ల క్రితం ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్త ప్రేమ‌గా మార‌డంతో.. గ‌త మూడు నెల‌ల నుంచి ఇల్లెందు ప‌ట్ట‌ణంలోని స్టేష‌నుబ‌స్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇరు కుటుంబాల‌ను ఒప్పించి శుక్ర‌వారం ఇల్లెందు ప‌ట్ట‌ణంలో వీరు హిందూ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబ స‌భ్యులు, బంధు మిత్రులు హాజ‌రై నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించారు. కాగా..వీరి వివాహా వేడుక సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it